కూతురికి పేరు పెట్టిన మంచు మనోజ్‌

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:18 AM

మంచు మనోజ్‌, మౌనిక దంపతులకు ఏప్రిల్‌లో పాప పుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పాపకు బారసాల చేసి ‘దేవసేన శోభా ఎంఎం’ అని పేరు పెట్టినట్లు...

మంచు మనోజ్‌, మౌనిక దంపతులకు ఏప్రిల్‌లో పాప పుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పాపకు బారసాల చేసి ‘దేవసేన శోభా ఎంఎం’ అని పేరు పెట్టినట్లు మంచు మనోజ్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ‘శివ భక్తుడిని కనుక సుబ్రహ్మణ్య స్వామి భార్య పేరు వచ్చేలా ‘దేవసేన’ అని పెట్టాం. మా అత్తగారు శోభా నాగిరెడ్డి జ్ఞాపకార్థం ‘శోభ’ అని యాడ్‌ చేశాం’ అని వెల్లడించారు మనోజ్‌.

Updated Date - Jul 09 , 2024 | 02:18 AM