ఆసక్తిని రేకెత్తిస్తున్న మమ్ముట్టి భ్రమయుగం

ABN , Publish Date - Jan 31 , 2024 | 01:43 AM

విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న మహానటుడు మమ్ముట్టి. మలయాళంలో ఆయన సూపర్‌స్టార్‌. అంత స్టార్‌డమ్‌లోనూ ఏ తరహా పాత్రనైనా చేసేస్తారాయన. రీసెంట్‌గా వచ్చిన మలయాళ చిత్రం ‘కాదల్‌ కోర్‌’లో స్వలింగసంపర్కునిగా నటించారాయన...

ఆసక్తిని రేకెత్తిస్తున్న మమ్ముట్టి భ్రమయుగం

విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న మహానటుడు మమ్ముట్టి. మలయాళంలో ఆయన సూపర్‌స్టార్‌. అంత స్టార్‌డమ్‌లోనూ ఏ తరహా పాత్రనైనా చేసేస్తారాయన. రీసెంట్‌గా వచ్చిన మలయాళ చిత్రం ‘కాదల్‌ కోర్‌’లో స్వలింగసంపర్కునిగా నటించారాయన. ఆయన స్థాయిలో ఉన్న ఏ నటుడూ ఆ పాత్ర చేయరు. దటీజ్‌ మముట్టి. ఆయన నటిస్తున్న మరో వైవిధ్య చిత్రం ‘భ్రమయుగం’. కేరళ సాంప్రదాయంతో కూడిన మమ్ముట్టి గెటప్స్‌ చూస్తుంటే, కథలో ఆసక్తికలిగించే అంశం ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. రాహుల్‌ సదాశివన్‌ రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చక్రవర్తి రామచంద్ర, ఎస్‌.శశికాంత్‌ కలిసి నిర్మించారు. ఫిబ్రవరి 15న ఈ పాన్‌ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: మాటలు: టి.డి.రామకృష్ణన్‌, షెహనాద్‌ జలాల్‌, సంగీతం: క్రిస్టో జెవియర్‌.

Updated Date - Jan 31 , 2024 | 01:43 AM