దృశ్యకావ్యంలా...
ABN , Publish Date - Sep 09 , 2024 | 05:17 AM
మలయాళ నటుడు టొవినో థామస్ నటించిన 50వ చిత్రం ‘ఏ.ఆర్.ఎమ్’ (అజాయంతే రందం మోషణం). కృతిశెట్టి, ఐశ్వర్వ రాజేశ్, సురభి లక్ష్మీ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రాన్ని జితిన్ లాల్ తెరకెక్కించారు.
మలయాళ నటుడు టొవినో థామస్ నటించిన 50వ చిత్రం ‘ఏ.ఆర్.ఎమ్’ (అజాయంతే రందం మోషణం). కృతిశెట్టి, ఐశ్వర్వ రాజేశ్, సురభి లక్ష్మీ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రాన్ని జితిన్ లాల్ తెరకెక్కించారు. లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఈ నెల 12న విడుదలవుతున్న సందర్భంగా టొవినో థామస్ మీడియాతో ముచ్చటించారు. ‘‘ఇదో విభిన్న తరహా చిత్రం. ఇందులో నేను మూడు రకాల పాత్రలు పోషించాను. ఈ సినిమా కోసం యుద్ధవిద్యలు నేర్చుకున్నాను. దర్శకుడు జితిన్ సినిమాను అనుకున్నదానికంటే గొప్పగా తెరకెక్కించాడు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు అధికంగా ఉంటాయి. దర్శకుడు ఈ కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల కోసం ఈ సినిమాను ఓ దృశ్యకావ్యంలా మలిచారు. మంచి కథ దొరికితే తెలుగులోనూ స్ట్రయిట్ చిత్రం చేస్తాను’’ అని చెప్పారు.