ప్రకాశ్‌రాజ్‌తో ‘జై శ్రీరామ్’ అనిపిస్తా
ABN , Publish Date - Sep 30 , 2024 | 02:18 AM
‘ప్రకాశ్‌రాజ్ దేవుణ్ణి నమ్ముతారో లేదో నాకు తెలియదు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో ఆయన చేత ‘శివయ్యా’ అనిపించా. త్వరలో ‘జై శ్రీరామ్’ అని కూడా అనిపిస్తా’ అని నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. లడ్డూ కల్తీ వివాదంలో...
‘ప్రకాశ్‌రాజ్ దేవుణ్ణి నమ్ముతారో లేదో నాకు తెలియదు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో ఆయన చేత ‘శివయ్యా’ అనిపించా. త్వరలో ‘జై శ్రీరామ్’ అని కూడా అనిపిస్తా’ అని నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. లడ్డూ కల్తీ వివాదంలో ‘మీ హద్దుల్లో ఉండండి’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ను హెచ్చరిస్తూ తాను చేసిన ట్వీట్‌పై తాజాగా విష్ణు మీడియా ముందు స్పందించారు. ‘పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ప్రకాశ్‌రాజ్ వక్రీకరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సబబుగా లేవు. ప్రకాశ్‌రాజ్ అంటే నాకు గౌరవం ఉంది. మా మధ్యన ఎలాంటి గొడవలు లేవు’ అని విష్ణు చెప్పారు. అత్యాచారం కేసులో జానీ మాస్టర్‌పై ఆరోపణలు నిజమని తేలితే ఆయనకు కఠిన శిక్ష పడాలని విష్ణు అన్నారు. హేమ డ్రగ్స్ కేసుపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.