మహీ గంగా హారతి

ABN , Publish Date - May 22 , 2024 | 12:45 AM

వంక పెట్టడానికి వీల్లేని అభినయంతో హీరోయిన్‌గా అభిమానులను అలరిస్తున్నారు జాన్వీకపూర్‌. ఒక సినిమాలో నటించడంతోనే తన బాధ్యత తీరిపోయినట్లు జాన్వీ ఎప్పుడూ...

మహీ గంగా హారతి

వంక పెట్టడానికి వీల్లేని అభినయంతో హీరోయిన్‌గా అభిమానులను అలరిస్తున్నారు జాన్వీకపూర్‌. ఒక సినిమాలో నటించడంతోనే తన బాధ్యత తీరిపోయినట్లు జాన్వీ ఎప్పుడూ భావించరు అనేది బాలీవుడ్‌ నిర్మాతల మాట. ఇటీవలే ఆమె నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారం కోసం దేశంలోని ప్రధాన నగరాలను చుట్టొస్తున్నారు జాన్వీ. హీరో రాజ్‌కుమార్‌ రావుతో కలసి తమ సినిమాకు ప్రచారం కల్పిస్తున్నారు. వీరిద్దరూ కలసి మంగళవారం కాశీ పర్యటన చేశారు. అందులో భాగంగా జాన్వీ సంప్రదాయ దుస్తుల్లో గంగా హరతి కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

Updated Date - May 22 , 2024 | 12:46 AM