మహేశ్‌ను జపాన్‌ తీసుకొస్తా

ABN , Publish Date - Mar 20 , 2024 | 06:20 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం దేశవిదేశాల్లో విజయం సాధించింది. అలాగే ఇటీవల జరిగిన ఆస్కార్‌ వేడుకల సందర్భంగా...

మహేశ్‌ను జపాన్‌ తీసుకొస్తా

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం దేశవిదేశాల్లో విజయం సాధించింది. అలాగే ఇటీవల జరిగిన ఆస్కార్‌ వేడుకల సందర్భంగా గత ఏడాది ఆస్కార్‌ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం సృష్టించిన సందర్భాన్నా అందరూ మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా జపాన్‌లో కూడా విడుదలై విజయం సాధించింది. ఈ విజయాన్ని అక్కడి ప్రేక్షకులతో కలసి ఆస్వాదించడానికి రాజమౌళి ఇటీవలే జపాన్‌ వె ళ్లారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి ప్రేక్షకులతో మాట్లాడుతూ ‘‘నేను దర్శకత్వం వహించే నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కేవలం కథానాయకుడు మాత్రమే ఖరారు అయ్యారు. ఆయన పేరు మహేశ్‌బాబు. చాలా అందంగా ఉంటారు. త్వరలోనే ఈ సినిమాను మొదలుపెడ్తాను. సినిమా రిలీజ్‌ సమయానికి మహేశ్‌ను కూడా జపాన్‌ తీసుకువచ్చి మీకందరికీ పరిచయం చేస్తాను. మహేశ్‌ను కూడా కచ్చితంగా మీరందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.

Updated Date - Mar 20 , 2024 | 06:20 AM