మహారాష్ట్ర మహారాణిగా..

ABN , Publish Date - Jan 31 , 2024 | 01:54 AM

కెరీర్‌ బిగింగ్‌లో యువతరాన్ని మాత్రమే టార్గెట్‌ చేశారు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా. నటిగా మెప్పిస్తే ఉండే కిక్కేంటో ‘యానిమల్‌’ సినిమా తర్వాత అర్థమైనట్టుంది. ఇప్పుడు అన్ని జనరేషన్స్‌నూ ఆకట్టుకునే పనిలోవున్నారామె. అందులో భాగంగా...

మహారాష్ట్ర మహారాణిగా..

కెరీర్‌ బిగింగ్‌లో యువతరాన్ని మాత్రమే టార్గెట్‌ చేశారు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా. నటిగా మెప్పిస్తే ఉండే కిక్కేంటో ‘యానిమల్‌’ సినిమా తర్వాత అర్థమైనట్టుంది. ఇప్పుడు అన్ని జనరేషన్స్‌నూ ఆకట్టుకునే పనిలోవున్నారామె. అందులో భాగంగా తాను చేస్తున్న సినిమానే ‘చావా’. చత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత గాథ ఆధారంగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. శంభాజీ భార్య, మహారాష్ట్ర ఎంపైర్‌ మహారాణి యేసుభాయ్‌ భోస్లే పాత్రను ఇందులో రష్మిక పోషిస్తున్నారు. ఆమె నటిస్తున్న తొలి హిస్టారికల్‌ మూవీ ఇది. మహారాష్ట్ర చరిత్రలో యేసుభాయ్‌ భోస్లే పాత్ర విశిష్టమైనది. ఆ పాత్ర చేయడం సామాన్యమైన విషయం కాదు. అలాంటి గొప్ప పాత్రను పోషించనున్నారు రష్మిక మందన్నా. ఇందులో శంభాజీ మహరాజ్‌గా విక్కీ కౌశల్‌ నటిస్తుండగా, అశుతోష్‌ రాణా, అక్షయ్‌ఖన్నా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాత్ర చేస్తుండటం పట్ల రష్మిక ఆనందం వెలిబుచ్చారు. ‘అరుదుగా దొరికే అదృష్టం ఇది. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌కు థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నాను’ అన్నారామె.

Updated Date - Jan 31 , 2024 | 01:54 AM