అన్యాయంపై మహారాగ్ని అస్త్రం

ABN , Publish Date - May 29 , 2024 | 06:38 AM

కాజోల్‌, ప్రభుదేవా ప్రధాన పాత్రలు పోషిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మహారాగ్ని’. ఈ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌కు చరణ్‌ తేజ్‌ ఉప్పలపాటి దర్శకుడు. నసీరుద్దీన్‌ షా, సంయుక్త మీనన్‌...

అన్యాయంపై మహారాగ్ని అస్త్రం

కాజోల్‌, ప్రభుదేవా ప్రధాన పాత్రలు పోషిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మహారాగ్ని’. ఈ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌కు చరణ్‌ తేజ్‌ ఉప్పలపాటి దర్శకుడు. నసీరుద్దీన్‌ షా, సంయుక్త మీనన్‌, జిషు సేన్‌ గుప్తా కీలకపాత్రలు పోషిస్తున్నారు. వెంకట అనిష్‌ దొరిగిల్లు నిర్మిస్తున్నారు. మంగళవారం చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసి, సినిమాలోని పాత్రలను పరిచయం చేసింది. పోరాట ఘట్టాల్లో కాజోల్‌ సంభాషణలు, నటన ఆకట్టుకున్నాయి. ప్రభుదేవా దుర్మార్గుడైన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు. సంయుక్తా మీనన్‌ కొత్త తరహా పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌. సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు, ఎడిటర్‌: నవీన్‌ నూలి

Updated Date - May 29 , 2024 | 06:38 AM