టీనేజ్‌ డ్రామాతో ‘మ్యాజిక్‌’

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:37 AM

ప్రతిభను ప్రోత్సహించడంతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. లాస్టియర్‌ కొత్తవారితో ఆ సంస్థ నిర్మించిన ‘మ్యాడ్‌’ చిత్రం హిట్‌ అయింది. ఇప్పుడు మరోసారి అటువంటి మ్యాజిక్‌ చేయడానికి ఆ సంస్థ సిద్ధమవుతోంది...

టీనేజ్‌ డ్రామాతో ‘మ్యాజిక్‌’

ప్రతిభను ప్రోత్సహించడంతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. లాస్టియర్‌ కొత్తవారితో ఆ సంస్థ నిర్మించిన ‘మ్యాడ్‌’ చిత్రం హిట్‌ అయింది. ఇప్పుడు మరోసారి అటువంటి మ్యాజిక్‌ చేయడానికి ఆ సంస్థ సిద్ధమవుతోంది. ‘జెర్సి’ చిత్రం తర్వాత దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి కొత్తవారితో ‘మ్యాజిక్‌’ పేరుతో సెన్సిబుల్‌ టీనేజ్‌ డ్రామా రూపొందిస్తున్నారు. తమ కాలేజీలో జరిగే ఫెస్ట్‌ కోసం నలుగురు టీనేజర్లు ఒక పాటను కంపోజ్‌ చేయడానికి చేసే ప్రయత్నాలు కథగా ఈ చిత్రం ఉంటుంది.. ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే అంశాలు ఎన్నో సినిమాలో ఉన్నాయంటున్నారు.ఈ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌కు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. గిరీశ్‌ గంగాధరన్‌ ఫొటోగ్రఫర్‌గా, నవీన్‌ నూలి ఎడిటర్‌గా, కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా నీరజ కోన పని చేస్తున్నారు. నూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. సమర్పణ శ్రీకర్‌ స్టూడియోస్‌.

Updated Date - Jan 30 , 2024 | 05:39 AM