హేమపై నిషేధాన్ని తొలగించిన ‘మా’

ABN , Publish Date - Aug 24 , 2024 | 06:44 AM

నటి హేమ ఊపిరి పీల్చుకున్నారు. ఆమెపై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) నిషేధాన్ని తొలగించింది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మేలో జరిగిన ఓ రేవ్‌ పార్టీలో

నటి హేమ ఊపిరి పీల్చుకున్నారు. ఆమెపై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) నిషేధాన్ని తొలగించింది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మేలో జరిగిన ఓ రేవ్‌ పార్టీలో ఆమె డ్రగ్స్‌ తీసుకుందని.. పోలీసులు నిర్వహించిన డ్రగ్స్‌ టెస్టులో నిర్థారణ కావడంతో ఆమెపై ‘మా’ సస్పెన్షన్‌ విధించింది. అయితే ఆమె అందులో నిరపరాధినని పేర్కొంటూ.. ఓ ల్యాబ్‌లో మెడికల్‌ టెస్టులు చేసుకుని ఆ నివేదికల్ని మంచు విష్ణుకు ఓ లేఖతో పాటు అందించారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన ‘మా’ ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు.

సినీటాకు మంచు విష్ణు లేఖ

ప్రభా్‌సపై బాలీవుడ్‌ అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిందే. ఈ వివాదంపై స్పందిస్తూ.. మంచు విష్ణు ‘మా’ తరపున ‘సినీటా’ (సినిమా అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్షురాలు పూనమ్‌ థిల్లాన్‌కు లేఖ రాశారు. ‘‘ప్రతీ ఒక్కరికి నచ్చినట్లు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కానీ ప్రభా్‌సని కించపరుస్తూ ఆర్షద్‌ చేసిన వ్యాఖ్యల వల్ల అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సినీనటుల ఐక్యత, గౌరవాన్ని కాపాడటంలో ఎల్లప్పుడూ ముందుండే ‘సినీటా’.. ఈ వివాదంపై స్పందిస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో మరోసారి పునరావృత్తం కాకుండా తగిన సూచనలు అర్షద్‌కు చేస్తారని ఆశిస్తున్నాను. మనమంతా ఒకే కుటుంబం. ఆ ఐక్యతను కొనసాగిద్దాం’’ అని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 06:44 AM