సూపర్‌ హీరోల ప్రేమకథ

ABN , Publish Date - Sep 13 , 2024 | 04:41 AM

సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 11న విడుదలవుతోంది...

సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 11న విడుదలవుతోంది. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మేకర్స్‌ హీరో నాని చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘ఇది మార్వెల్‌ సూపర్‌హీరో సినిమా కాదు. ఈ సినిమాలో హీరోకి ఉండే పవర్‌ పేరు ప్రేమ. ఇద్దరు సూపర్‌ హీరోల మధ్య జరిగే లవ్‌ స్టోరీ ఇది. కుటుంబంతో కలసి ఎంజాయ్‌ చేస్తూ చూసేలా ఉంటుంది’ అన్నారు. అభిలాష్‌ మాట్లాడుతూ ‘తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రాసుకున్న అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను.


మా టీం చాలా కష్టపడింది. అందరూ ఎంజాయ్‌ చేస్తారు’ అని చెప్పారు. ఒక మంచి చిత్రంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని హీరోయిన్‌ ఆర్ణ తెలిపారు. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉందని సునీల్‌ చెప్పారు.

Updated Date - Sep 13 , 2024 | 04:41 AM