లవ్వు.. నవ్వు.. జీవితం

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:08 AM

ప్రియదర్శి, నభా నటేశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘డార్లింగ్‌’ నుంచి సెకండ్‌ సింగిల్‌ విడుదల చేశారు. ‘రాహి రే’ అంటూ సాగే ఈ పాటను గీత రచయిత కాసర్ల శ్యామ్‌ రాయగా...

ప్రియదర్శి, నభా నటేశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘డార్లింగ్‌’ నుంచి సెకండ్‌ సింగిల్‌ విడుదల చేశారు. ‘రాహి రే’ అంటూ సాగే ఈ పాటను గీత రచయిత కాసర్ల శ్యామ్‌ రాయగా, కపిల్‌ కపిలన్‌ పాడారు. ఇండియాలోని వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ పాడుకొనే పాట ఇది. ఆమె జర్నీని సినిమాటోగ్రాఫర్‌ నరేశ్‌ రామదురై అందంగా చిత్రీకరించారు. వివేక్‌ సాగర్‌ స్వరాలు అందించారు. అశ్విన్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నిరంజన్‌రెడ్డి, శ్రీమతి చైతన్య చెప్పారు. ‘ఎంజాయ్‌బుల్‌ మెలోడీ ఇది. తొలి పాటలానే ఇది కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రేమ, నవ్వు, జీవితం.. ఈ అంశాలతో రూపుదిద్దుకున్న సినిమా ఇది. అనన్య నాగళ్ల మరో కీలక పాత్ర పోషిస్తున్నారు’ అని తెలిపారు. బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: హేమంత్‌, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: సీతారామ్‌ వై.

Updated Date - Jul 03 , 2024 | 03:08 AM