లవ్‌ జిహాద్‌ డ్రిల్‌

ABN , Publish Date - Feb 09 , 2024 | 03:02 AM

అమెరికాలో డాక్టర్‌గా సెటిల్‌ అయిన హరనాథ్‌ పొలిచర్ల సినిమా మీద మమకారంతో ఇండియా వచ్చి చిత్రాలు తీస్తుంటారు. స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘డ్రిల్‌’ ఈ నెల 16న విడుదల కానుంది...

లవ్‌ జిహాద్‌ డ్రిల్‌

అమెరికాలో డాక్టర్‌గా సెటిల్‌ అయిన హరనాథ్‌ పొలిచర్ల సినిమా మీద మమకారంతో ఇండియా వచ్చి చిత్రాలు తీస్తుంటారు. స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘డ్రిల్‌’ ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినిమా టీజర్‌ను విడుదల చేశారు. సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై హరనాథ్‌ మరెన్నో సినిమాలు తీయాలనీ, ‘డ్రిల్‌’ చిత్రం విజయవంతం కావాలనీ కోరారు.

డాక్టర్‌ హరనాథ్‌ మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ కారణంగానే ఇప్పటివరకూ ఎనిమిది సినిమాలు తీశా. అమెరికాలో డాక్టర్‌ వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా ఎప్పటికప్పుడు సినిమా అప్టేట్స్‌ తెలుసుకుంటుంటాను. లవ్‌ జిహాద్‌ మీద తెలుగులో ఇంతవరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకే ఆ కాన్సెప్ట్‌తో స్ర్కిప్ట్‌ రెడీ చేసుకుని ఇండియాకు వచ్చి సినిమా తీశా. ఇంతవరకూ నేను చేసిన సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది’ అన్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో భవ్య, సిషిగంధ, తనికెళ్ల భరణి, జెమినీ సురేశ్‌, కోటేశ్వరరావు, సత్తన్న, విశ్వ , జబర్దస్త్‌ ఫణి తదితరులు నటించారు.

Updated Date - Feb 09 , 2024 | 03:02 AM