ప్రేమంటే త్యాగం

ABN , Publish Date - Aug 26 , 2024 | 06:03 AM

సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే నటీమణుల్లో సమంత ఒకరు. తాజాగా, ఆమె ప్రేమ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘చాలా మంది ప్రేమ.. స్నేహం అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనుకుంటారు. ఈ విషయాన్ని నేనూ అంగీకరిస్తాను...

సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే నటీమణుల్లో సమంత ఒకరు. తాజాగా, ఆమె ప్రేమ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘చాలా మంది ప్రేమ.. స్నేహం అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనుకుంటారు. ఈ విషయాన్ని నేనూ అంగీకరిస్తాను. కానీ నిజమైన ప్రేమంటే.. కొన్నిసార్లు అవతలి వ్యక్తి మనకు ప్రేమనివ్వలేని స్థితిలో ఉన్నా.. మనం ప్రేమనందించాలి అని నేర్చుకున్నాను’’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘‘ప్రేమంటే త్యాగం కూడా. పరిస్థితులకనుగుణంగా అది మారిపోతుండొచ్చు. నేను తిరిగి ప్రేమనందించలేకపోయినా.. నన్ను నిరంతరం ప్రేమించే అభిమానులకు రుణపడి ఉంటాను’’ అని అదే పోస్ట్‌లో పేర్కొన్నారు. సమంత నటించిన ‘సిటాడెల్‌’ వెబ్‌సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌ ‘హనీ బన్నీ’ త్వరలో ప్రముఖ ఓటీటీలో స్ర్టీమింగ్‌ అవనుంది. అలాగే ఆమె నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రం సెట్స్‌పై ఉంది.

Updated Date - Aug 26 , 2024 | 06:03 AM