లవ్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:46 AM

మేఘశ్యామ్‌, రేఖ నిరోషా జంటగా రూపుదిద్దుకొన్న ‘వాస్తవం’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. జీవన్‌ బండి దర్శకత్వంలో ఆదిత్య ముద్గల్‌ ఈ సినిమా నిర్మించారు. మంగళవారం టీజర్‌ను విడుదల...

లవ్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌

మేఘశ్యామ్‌, రేఖ నిరోషా జంటగా రూపుదిద్దుకొన్న ‘వాస్తవం’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. జీవన్‌ బండి దర్శకత్వంలో ఆదిత్య ముద్గల్‌ ఈ సినిమా నిర్మించారు. మంగళవారం టీజర్‌ను విడుదల చేసిన అనంతరం నిర్మాత మాట్లాడుతూ ‘లవ్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా చిత్రం రూపుదిద్దుకుంది. సినిమా మీద ఇష్టంతో చాలా కష్టపడి తీశాం. ప్రేక్షకుల ఆశీస్సులు కోరుకుంటున్నాం’ అన్నారు. ‘ఈ సినిమాలో ప్రతి చిన్న క్యారెక్టర్‌ గుర్తుండి పోతుంది. అందరి సహకారంతో మంచి సినిమా తీశాను. తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు దర్శకుడు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి, హిట్‌ చేయాలని హీరో మేఘశ్యామ్‌, హీరోయిన్‌ రేఖ నిరోషా కోరారు.

Updated Date - Feb 21 , 2024 | 03:46 AM