లవ్‌ గురు ప్రేమ పాట్లు

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:40 AM

వైవిధ్యమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న తమిళ నటుడు విజయ్‌ ఆంటోని తాజా చిత్రం ‘లవ్‌ గురు’. తొలిసారిగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ జానర్‌లో ఆయన చేసిన సినిమా ఇది. దీనికి నిర్మాత కూడా ఆయనే...

లవ్‌ గురు ప్రేమ పాట్లు

వైవిధ్యమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న తమిళ నటుడు విజయ్‌ ఆంటోని తాజా చిత్రం ‘లవ్‌ గురు’. తొలిసారిగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ జానర్‌లో ఆయన చేసిన సినిమా ఇది. దీనికి నిర్మాత కూడా ఆయనే. మృణాలిని రవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహించారు. రంజాన్‌ పండగ సందర్భంగా ఏప్రిల్‌ 11న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబూటర్స్‌ ద్వారా విడుదల చేస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పెళ్లి అంటే ఇష్టం లేకపోయినా తండ్రి మాట కాదనలేక పెళ్లికి అంగీకరిస్తుంది ప్రియ. కానీ కాబోయే భర్తకు కొన్ని కండిషన్స్‌ పెడుతుంది. ఆమె అంటే ఇష్టం ఉన్న లవ్‌ గురు ఆ షరతులకు అంగీకరిస్తాడు. కానీ పెళ్లయ్యాక కానీ వాటిలో ఉన్న ఇబ్బందులు అర్థం కావు. ఆ సమస్యల నుంచి హీరో ఎలా బయట పడ్డాడు, భార్య ప్రేమను ఎలా పొందగలిగాడు.. అనే అంశాల్ని ఈ ట్రైలర్‌లో వినోదాత్మకంగా చూపించారు. యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే విధంగా సినిమాను తీర్చిదిదినట్లు దర్శకనిర్మాతలు చెప్పారు.

Updated Date - Mar 27 , 2024 | 01:40 AM