ప్రేమించి పెళ్లి చేసుకుంటా

ABN , Publish Date - Mar 30 , 2024 | 04:47 AM

తాను ప్రేమ పెళ్ళి చేసుకుంటానని, అయితే, తనకు కాబోయే భార్య తన తల్లిదండ్రులనూ ప్రేమించేలా ఉండాలని విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆయన నటించిన ‘ఫ్యామిలీస్టార్‌’ చిత్రం ఏప్రిల్‌ 5న విడుదలకానుంది....

ప్రేమించి పెళ్లి చేసుకుంటా

తాను ప్రేమ పెళ్ళి చేసుకుంటానని, అయితే, తనకు కాబోయే భార్య తన తల్లిదండ్రులనూ ప్రేమించేలా ఉండాలని విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆయన నటించిన ‘ఫ్యామిలీస్టార్‌’ చిత్రం ఏప్రిల్‌ 5న విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఆ చిత్ర నిర్మాత దిల్‌ రాజుతో కలసి ఆయన చెన్నైలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ... ‘పెళ్ళి చేసుకుని భార్యాపిల్లలతో కలిసి జీవించాలన్న ఆశ, కోరిక నాకు కూడా ఉన్నాయి. కానీ, దానికి కొంత సమయం పడుతుంది. అయితే ప్రేమించే పెళ్లి చేసుకుంటా. నాకు కాబోయే భార్య నా తల్లిదండ్రులను కూడా ప్రేమించాలి. ఆమెను మా అమ్మనాన్న ఇష్టపడాలి. ఇప్పటివరకు నేను ఎవరినీ ప్రేమించలేదు. ఒక సినిమాలో హీరోయిన్‌ ఎంపిక దర్శకుడు, నిర్మాత చేతుల్లోనే ఉంటుంది. హీరోకు సంబంధం ఉండదు. రాజకీయాల్లో వచ్చే స్థాయికి ఇంకా ఎదగలేదు. చిత్రపరిశ్రమలోనే ఇంకా పైస్థాయికి రావాలన్నదే నా కోరిక’ అని అన్నారు.

Updated Date - Mar 30 , 2024 | 04:47 AM