హాట్‌గా కనిపించడం కష్టమే!

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:43 AM

‘ప్రేమం’తో కుర్రకారు మతిపోగొట్టి.. గర్ల్‌ నెక్స్ట్‌ డోర్‌ పాత్రలతో మెప్పించారు క్యూట్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌. ప్రస్తుతం ఆమె ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రంలో హాట్‌హాట్‌గా కనిపించడం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. ఈ నెల 29న ఈ చిత్రం...

హాట్‌గా కనిపించడం కష్టమే!

‘ప్రేమం’తో కుర్రకారు మతిపోగొట్టి.. గర్ల్‌ నెక్స్ట్‌ డోర్‌ పాత్రలతో మెప్పించారు క్యూట్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌. ప్రస్తుతం ఆమె ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రంలో హాట్‌హాట్‌గా కనిపించడం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. ఈ నెల 29న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఆమె ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో లిల్లీ పాత్ర గురించి మాట్లాడారు. లిల్లీ పాత్రలో చాలా లేయర్స్‌ ఉంటాయి. ఈ సినిమాలో నేను వేసుకున్న డ్రెస్సులు రియల్‌ లైఫ్‌లో అస్సలు వేసుకోలేను. స్ర్కీన్‌పైన హాట్‌గా కనిపించాలంటే ఎంత కష్టమో ఈ చిత్రంతోనే తెలిసొచ్చింది. ఇప్పటివరకూ పక్కింటి అమ్మాయి పాత్రలు చేసే నేను ఒక్కసారిగా ఇలా గ్లామరస్‌ రోల్‌ చేయడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. నిజానికి ఇలా గ్లామరస్‌ రోల్స్‌ చేసే సమయంలో వేసుకునే డ్రెస్సులు అసౌకర్యంగానే ఉంటాయి. ఇప్పటివరకూ ఇలాంటి రోల్స్‌ చేసిన హీరోయిన్స్‌ను మెచ్చుకోవాల్సిందే. ఇందులో నా బాడీ లాంగ్వేజ్‌ మునుపటి చిత్రాలతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. లిల్లీ పాత్రలో సరికొత్త అనుపమను చూస్తారు’’ అని చెప్పారు.

Updated Date - Mar 27 , 2024 | 01:43 AM