గామి సినిమా కోసం ఎదురుచూస్తున్నా

ABN , Publish Date - Feb 13 , 2024 | 06:07 AM

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గామి’. ఈ సినిమా ప్రచార చిత్రాలను చూసిన ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘గామి’ చిత్రబృందంపై ప్రశంసలు...

గామి సినిమా కోసం ఎదురుచూస్తున్నా

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గామి’. ఈ సినిమా ప్రచార చిత్రాలను చూసిన ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘గామి’ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో హీరో మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడే అఘోరాగా కనిపించడమనే కాన్సె్‌ప్టను ఆయన అభినందించారు. చాలా ఓపిగ్గా, ఎంతోకాలం శ్రమించి, సాధించారు, మీ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా అని ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ్‌ అశ్విన్‌ తెలిపారు. ‘గామి’ మార్చి 8న థియేటర్లలో విడుదలవుతోంది.

Updated Date - Feb 13 , 2024 | 06:07 AM