కొంచెం కొంచెం...

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:33 AM

చిమటా రమేశ్‌బాబు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘నేను-కీర్తన’. ఈ చిత్రం నుంచి ‘కొంచెం కొంచెం గుడుగుడు గుంజం’ అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని నటుడు...

కొంచెం కొంచెం...

చిమటా రమేశ్‌బాబు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘నేను-కీర్తన’. ఈ చిత్రం నుంచి ‘కొంచెం కొంచెం గుడుగుడు గుంజం’ అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని నటుడు, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు మురళీమోహన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నేను-కీర్తన’ ట్రైలర్‌, సాంగ్స్‌ బావున్నాయి. నేను విడుదల చేసిన ఐటమ్‌ సాంగ్‌ థియేటర్స్‌లో విజిల్‌ వేయిస్తుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి’ అని ఆకాంక్షించారు. ఈ చిత్రంలో రిషిత, మేఘన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిమటా లక్ష్మీకుమారి నిర్మాత. త్వరలో ‘నేను-కీర్తన’ విడుదల తేదీని ప్రకటిస్తామని రమేశ్‌బాబు చెప్పారు. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతో పాటు ఆరు రోప్‌ ఫైట్స్‌ ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్‌ రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, ఎడిటింగ్‌, వినయ్‌రెడ్డి.

Updated Date - Jun 29 , 2024 | 03:33 AM