ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా..

ABN , Publish Date - Sep 17 , 2024 | 05:26 AM

చంద్రహాస్‌ హీరోగా నటిస్తున్న ‘రామ్‌నగర్‌ బన్నీ’ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సినిమాలో విస్మయశ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రీతూ మంత్ర హీరోయిన్లు. శ్రీనివాస్‌ మహత్‌ దర్శకుడు...

చంద్రహాస్‌ హీరోగా నటిస్తున్న ‘రామ్‌నగర్‌ బన్నీ’ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సినిమాలో విస్మయశ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రీతూ మంత్ర హీరోయిన్లు. శ్రీనివాస్‌ మహత్‌ దర్శకుడు. అక్టోబర్‌ నాలుగున సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు మలయజ ప్రభాకర్‌, పొడకండ ప్రభాకర్‌ చెప్పారు. ఈ సినిమా కోసం చంద్రహాస్‌ బాగా కష్టపడ్డాడనీ, అతనికి మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని దర్శకుడు శ్రీనివాస్‌ మహత్‌ చెప్పారు. అన్ని ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులందరికీ నచ్చేలా చిత్రం ఉంటుందని తెలిపారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రకథ ఎన్నుకున్నామనీ, తన కుమారుడి మొదటి సినిమాను సకుటుంబంగా ప్రేక్షకులు చూడాలనుకున్నామనీ ప్రభాకర్‌ చెప్పారు మరో రెండు సినిమాలు ఉన్నా మొదట ‘రామ్‌నగర్‌ బన్నీ’నే విడుదల చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Sep 17 , 2024 | 05:26 AM