శేఖర్‌ కమ్ముల సినిమాలా...

ABN , Publish Date - Jan 20 , 2024 | 12:34 AM

‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మి’. ప్రణీకాన్వికా కథానాయిక. వీఎస్‌ ముఖేశ్‌ యువ దర్శకత్వంలో అఖిలేశ్‌

శేఖర్‌ కమ్ముల సినిమాలా...

‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మి’. ప్రణీకాన్వికా కథానాయిక. వీఎస్‌ ముఖేశ్‌ యువ దర్శకత్వంలో అఖిలేశ్‌ కలారు నిర్మించారు. హర్షవర్ధన్‌ కీలకపాత్ర పోషించారు. ఈ మూవీ టైటిల్‌ పోస్టర్‌ను నటుడు శివాజీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇది నా మొదటి సినిమా. సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్నాం’ అన్నారు. చక్కటి ఫ్యామిలీ, లవ్‌ డ్రామాగా ఈ సినిమాను రూపొందించామని నిర్మాత చెప్పారు. ‘మార్కెట్‌ మహాలక్ష్మి’ సినిమా చూస్తుంటే శేఖర్‌ కమ్ముల సినిమాలు గుర్తుకొచ్చాయని నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ చెప్పారు.

Updated Date - Jan 20 , 2024 | 12:34 AM