సినిమా లవర్స్‌కు ఫుల్‌ మీల్స్‌లా...

ABN , Publish Date - May 26 , 2024 | 05:57 AM

పాపులర్‌ డైరెక్టర్‌ కె.విజయ్‌భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉషా పరిణయం’. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అనేది ఉపశీర్షిక. ఈ ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో...

సినిమా లవర్స్‌కు ఫుల్‌ మీల్స్‌లా...

పాపులర్‌ డైరెక్టర్‌ కె.విజయ్‌భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉషా పరిణయం’. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అనేది ఉపశీర్షిక. ఈ ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో విజయభాస్కర్‌ తనయుడు శ్రీకమల్‌ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్‌గా తన్వీ ఆకాంక్ష నటిస్తున్నారు. శనివారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయభాస్కర్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్రేమకు నిర్వచనం. సినిమా లవర్స్‌కు ఫుల్‌ మీల్స్‌లా ఉంటుందీ చిత్రం’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని హీరో శ్రీకమల్‌ అన్నారు. హీరోయిన్‌ తన్వీ మాట్లాడుతూ ‘‘అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: ఎమ్‌.ఆర్‌.వర్మ, డీఓపీ: సతీశ్‌ ముత్యాల, సంగీతం: ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌.

Updated Date - May 26 , 2024 | 05:57 AM