రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం
ABN , Publish Date - Jan 03 , 2024 | 12:23 AM
సుహాస్ హీరోగా నటిస్తున్న ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో జీఎ2 పిక్చర్స్, మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని...

సుహాస్ హీరోగా నటిస్తున్న ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో జీఎ2 పిక్చర్స్, మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలోని ‘మా ఊరు’ లిరికల్ వీడియోను యువ హీరో తేజ సజ్జా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం.. ఇటు రారో ఈ బతుకు పాటను ఇందాం.. ఈ సన్నాయి నొక్కుల్లోనా ఊరించే సంగతులెన్నో ఉన్నాయ్’ అంటూ రెహమాన్ రాసిన ఈ పాటకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు. కామెడీ డ్రామా కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శివాని నాగరం, శరణ్య ప్రదీప్, ప్రతాప్, గోపరాజు రమణ తదితరులు నటించారు.