ఆ గొప్పతనం చాటేలా..
ABN , Publish Date - Sep 18 , 2024 | 04:47 AM
నోయల్, రిషిత నెల్లూరు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘బహిర్భూమి’. రామ్‌ప్రసాద్ కొండూరు దర్శకత్వంలో మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మచ్చ వేణుమాధవ్...
నోయల్, రిషిత నెల్లూరు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘బహిర్భూమి’. రామ్‌ప్రసాద్ కొండూరు దర్శకత్వంలో మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మచ్చ వేణుమాధవ్ మాట్లాడుతూ ‘‘సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఎంతో ధైర్యంతో చేసిన చిత్రమిది. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో నోయెల్, ఫణి మధ్య వచ్చే కామెడీ సీన్స్ సినిమాకే హైలైట్ అవుతాయి. ఈ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టామో.. సినిమా చూస్తే తెలుస్తుంది. మన కల్చర్‌లోని గొప్పతనాన్ని చాటే చిత్రమిది’’ అని దర్శకుడు రామ్‌ప్రసాద్ కొండూరు అన్నారు. ‘‘చాలా మంచి చిత్రం చేశాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి’’ అని హీరో నోయెల్ తెలిపారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కోమరి, సంగీతం: అజయ్ పట్నాయక్.