ఓటీటీలో రిలీజ్‌ చేస్కో అన్నారు

ABN , Publish Date - Feb 05 , 2024 | 02:47 AM

బాలీవుడ్‌లో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘12్టజి ఫెయిల్‌’. పేదరికాన్ని అధిగమించి ఐపీఎస్‌ అధికారిగా ఎదిగిన మనోజ్‌కుమార్‌ శర్మ జీవిత కథ ఆధారంగా దర్శకుడు విధు వినోద్‌ చోప్రా...

ఓటీటీలో  రిలీజ్‌ చేస్కో అన్నారు

బాలీవుడ్‌లో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘12్టజి ఫెయిల్‌’. పేదరికాన్ని అధిగమించి ఐపీఎస్‌ అధికారిగా ఎదిగిన మనోజ్‌కుమార్‌ శర్మ జీవిత కథ ఆధారంగా దర్శకుడు విధు వినోద్‌ చోప్రా రూపొందించిన సినిమా ఇది. రూ. 20 కోట్లతో నిర్మిస్తే ఇప్పటికి రూ 60 కోట్లు వసూలు చేసింది. పెద్ద చిత్రాల పోటీని తట్టుకుని బరిలో నిలిచింది. విక్రాంత్‌ మాస్సే, మేధా శంకర్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విజయోత్సవంలో దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాను థియేటర్‌లో ఎవరూ చూడరు. మహా అయితే ఓపెనింగ్‌ కలెక్షన్లు ఏ రెండు లక్షలు, మొత్తం మీద రూ. 30 లక్షలు వస్తే గొప్పే. అందుకే థియేటర్‌లో కాకుండా ఓటీటీలో విడుదల చేసుకో’ అన్నారు చాలా మంది. వాళ్లలో నా భార్య కూడా ఉంది. అయినా కంటెంట్‌ మీద నమ్మకంతో నేను థియేటర్‌లోనే విడుదల చేశాను. నా సొంత డబ్బులతో పబ్లిసిటీ చేశాను. సినిమా ఫలితం ఏమిటన్నది మీ అందరికీ తెలిసిందే’ అన్నారు.

Updated Date - Feb 05 , 2024 | 02:47 AM