ఇంటి ముందు వాలిపోతా

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:35 AM

‘ఒక్క మాట చెప్పు చాలు ఇంటి ముందు వాలిపోతా’ అంటూ డ్యూయట్‌ పాడుకుంటున్నారు అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి. రావు రమేశ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’...

ఇంటి ముందు వాలిపోతా

‘ఒక్క మాట చెప్పు చాలు ఇంటి ముందు వాలిపోతా’ అంటూ డ్యూయట్‌ పాడుకుంటున్నారు అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి. రావు రమేశ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో బుజ్జిరాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య నిర్మిస్తున్నారు. చిత్రబృందం బుధవారం ‘మేడమ్‌ సార్‌’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యానికి కల్యాణ్‌ నాయక్‌ బాణీ కట్టారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. ఇంద్రజ, అంకిత్‌ కొయ్య, హర్షవర్ధన్‌ కీలకపాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీ: ఎంఎన్‌ బాల్‌రెడ్డి

Updated Date - Apr 18 , 2024 | 06:36 AM