పాన్‌ ఇండియా ఎంటర్టైనర్‌ ప్రారంభం

ABN , Publish Date - Feb 16 , 2024 | 05:43 AM

తమిళ హీరో శివకార్తికేయన్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా ఎంటర్టైనర్‌ షూటింగ్‌ బుధ వారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది...

పాన్‌ ఇండియా ఎంటర్టైనర్‌ ప్రారంభం

తమిళ హీరో శివకార్తికేయన్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా ఎంటర్టైనర్‌ షూటింగ్‌ బుధ వారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో కన్నడ నటి రుక్మిణి వసంత్‌ కథానాయిక. శ్రీలక్ష్మీ మూవీస్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో శివ కార్తికేయన్‌ను మురుగదాస్‌ సరికొత్తగా చూపించబోతున్నారు. గురువారం నుంచే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించినట్లు యూనిట్‌ తెలిపింది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. అనిరుధ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సుదీప్‌ ఎలామన్‌.

Updated Date - Feb 16 , 2024 | 05:43 AM