లేటెస్ట్ అప్‌డేట్
ABN , Publish Date - Aug 13 , 2024 | 05:08 AM
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఎన్‌బీకే 109కి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. బాబీ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఎన్‌బీకే 109కి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. బాబీ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో ఈ సినిమా కోసం తీస్తున్న కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందనీ సోమవారం సోషల్ మీడియా ద్వారా దర్శకుడు బాబీ వెల్లడించారు. ‘బాలకృష్ణ ఎనర్జీనీ, అద్భుతమైన అభినయాన్ని ఈ సినిమాలో చూస్తారు. థియేటర్లలో ఆ అనుభూతి కోసం సిద్ధంగా ఉండండి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా టైటిల్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు దర్శకుడు బాబీ. త్వరలోనే టైటిల్, టీజర్ విడుదలవుతాయని వెల్లడించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.