ల్యాండ్‌ మాఫియా వస్తోంది

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:18 AM

ప్రణయనాథ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘ల్యాండ్‌ మాఫియా’. మధుబాల కథానాయిక. బాబు వీఎన్‌ దర్శకుడు. మంగళవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది...

ల్యాండ్‌ మాఫియా వస్తోంది

ప్రణయనాథ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘ల్యాండ్‌ మాఫియా’. మధుబాల కథానాయిక. బాబు వీఎన్‌ దర్శకుడు. మంగళవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రణయనాథ మాట్లాడుతూ ‘చిన్న సినిమాగా మొదలైన ఈ ప్రాజెక్ట్‌ పెద్ద చిత్రంగా మారింది. ఓ మంచి చిత్రాన్ని తీశాం. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రణయనాథ సహకారం వల్లే సినిమాను అనుకున్న విధంగా తీయగలిగాం. ఖర్చుకు వెనుకాడకుండా అన్ని హంగులతో నిర్మించాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించాలి’ అని కోరారు. సందేశంతో పాటు అన్ని రకాల వాణిజ్య హంగులు ఉన్న చిత్రమిదని మధుబాల తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్‌ చంద్ర. సినిమాటోగ్రఫీ: వెంకట్‌ జె. ఎడిటర్‌: కృష్ణ మండల.

Updated Date - Jan 03 , 2024 | 12:18 AM