లక్ష్మీరాయ్ త్రిపాత్రాభినయం
ABN , Publish Date - Oct 22 , 2024 | 02:13 AM
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళ, కన్నడ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’. త్వరలోనే తెలుగులోనూ ఈ చిత్రాన్ని...
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళ, కన్నడ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’. త్వరలోనే తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సోమవారం ట్రైలర్ను సుమన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం తెలుగులోనూ ఘనవిజయం సాధిస్తుంది’’ అని చెప్పారు. ‘‘లక్ష్మీరాయ్ త్రిపాత్రాభినయం ఈ సినిమాకు ప్రధానాకర్షణ. ఇందులో ఆమె సమాజంలో జరిగే అన్యాయాలను అంతమొందించే శక్తిమంతమైన పాత్రను పోషించారు’’ అని చిత్ర నిర్మాత డా.ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు.