ముంబైలో కుబేర యాక్షన్‌

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:26 AM

ధనుష్‌, నాగార్జున కథానాయకులుగా రూపొందుతున్న మల్టీస్టారర్‌ ‘కుబేర’. దర్శకుడు శేఖర్‌ కమ్ముల తన పంథాకు భిన్నంగా పూర్తి వాణిజ్య హంగులతో..

ముంబైలో కుబేర యాక్షన్‌

ధనుష్‌, నాగార్జున కథానాయకులుగా రూపొందుతున్న మల్టీస్టారర్‌ ‘కుబేర’. దర్శకుడు శేఖర్‌ కమ్ముల తన పంథాకు భిన్నంగా పూర్తి వాణిజ్య హంగులతో రూపొందిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం బ్యాంకాక్‌ షెడ్యూల్‌ పూర్తి చేయగా, గురువారం నుంచి ముంబైలో తాజా షెడ్యూల్‌ ప్రారంభమైంది. 12 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో నగరంలోని పలు ప్రదేశాల్లో చిత్రీకరణ జరుగుతుంది. ధనుష్‌, రష్మికతో పాటు కీలకపాత్రధారులు పాల్గొనే ఈ షెడ్యూల్‌లో కొంత టాకీ పార్ట్‌తో పాటు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ తెరకెక్కించనున్నట్లు యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు నిర్మాతలు. రష్మిక మందన్న కథానాయిక. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: నికిత్‌ బొమ్మి

Updated Date - Apr 26 , 2024 | 06:26 AM