మన సినిమాలకంటే కొరియన్‌ ఫిల్మ్స్‌ బెస్ట్‌

ABN , Publish Date - May 15 , 2024 | 12:29 AM

భారతీయ సినిమాల మీద తనకున్న అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నటుడు నసీరుద్దీన్‌ షా. ‘మన సినిమాకంటే కొరియన్‌ ఫిల్మ్స్‌ బెస్ట్‌’ అని కూడా ఆయన కామెంట్‌ చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ వేడుకలో...

మన సినిమాలకంటే కొరియన్‌ ఫిల్మ్స్‌ బెస్ట్‌

భారతీయ సినిమాల మీద తనకున్న అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నటుడు నసీరుద్దీన్‌ షా. ‘మన సినిమాకంటే కొరియన్‌ ఫిల్మ్స్‌ బెస్ట్‌’ అని కూడా ఆయన కామెంట్‌ చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ వేడుకలో నసీరుద్దీన్‌ షా మాట్లాడుతూ ‘ఎందుకనో ‘బాలీవుడ్‌’ అనే పదమే నాకు నచ్చదు. భారతీయ ఫుడ్‌కు ప్రపంచ వ్యాప్తంగా పేరు ఉన్నట్లే గత వైభవాన్ని గౌరవిస్తూ మన సినిమాలను కూడా ఇప్పటికీ ప్రపంచ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నిజానికి మన చిత్రాలకంటే దక్షిణ కొరియా చిత్రాలు, థాయ్‌ సినిమాలు బాగుంటున్నాయి. ఆ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది మన వాళ్లు సినిమాలు తీస్తున్నారని చెప్పడానికి సిగ్గు పడనక్కర్లేదు. అయితే ఇకనైనా జాగ్రత్త పడకపోతే ఏదో ఒక రోజు మన సినిమాలకు ఉన్న ఫేమ్‌ గాలి బుడగలా పేలిపోవచ్చు’ అని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం నసీరుద్దీన్‌ షా సినిమాలు ఏమీ చేయడం లేదు. వెబ్‌ సిరీస్‌లో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తున్నారు.

Updated Date - May 15 , 2024 | 12:29 AM