Pushpa 2 : కోరమీసం రువ్వుతున్న రోషం

ABN , Publish Date - May 30 , 2024 | 12:18 AM

‘పుష్ప’ చిత్రంలో పుష్పరాజ్‌, శ్రీవల్లి పాత్రల్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంట. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప 2: ది రూల్‌’ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే...

Pushpa 2 : కోరమీసం రువ్వుతున్న రోషం

‘పుష్ప’ చిత్రంలో పుష్పరాజ్‌, శ్రీవల్లి పాత్రల్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంట. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప 2: ది రూల్‌’ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. తాజాగా ఈ చిత్రం నుంచి కపుల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ అంటూ సాగే గీతాన్ని బుధవారం విడుదల చేసింది. చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఐదు భాషల్లోనూ ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్‌ ఈ గీతాన్ని ఆలపించారు. ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, రావు రమేశ్‌ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్‌

Updated Date - May 30 , 2024 | 12:18 AM