కొండా విజయ్‌కుమార్ ‘అహం’
ABN, Publish Date - Mar 19 , 2024 | 03:54 AM
నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’, నాగచైతన్య హీరోగా ‘ఒక లైలా కోసం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు రూపొందించిన దర్శకుడు కొండా విజయ్‌కుమార్ ప్రస్తుతం మరో భారీ చిత్రాన్ని రూపొందించే...
నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’, నాగచైతన్య హీరోగా ‘ఒక లైలా కోసం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు రూపొందించిన దర్శకుడు కొండా విజయ్‌కుమార్ ప్రస్తుతం మరో భారీ చిత్రాన్ని రూపొందించే సన్నాహాల్లో ఉన్నారు. ఈ సినిమాకు ‘అహం’ అనే టైటిల్ నిర్ణయించారు. ఓ ప్రముఖ నిర్మాత తనయుడిని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేయనున్నారని సమాచారం. అలాగే నటుడు శివాజీ ఇందులో విలన్‌గా నటిస్తారనీ, ఆయన లుక్ చాలా డిఫరెంట్‌గా ఉండేట్లు దర్శకుడు విజయ్‌కుమార్ కేర్ తీసుకుంటున్నారనీ చెబుతున్నారు. ఈ సినిమా కోసం అనూప్ రూబెన్స్‌ను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారనీ, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంతో జరుగుతున్నాయనీ సమాచారం. త్వరలోనే ‘అహం’ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నదని అంటున్నారు.