కీర్తన ప్రేమకథ

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:19 AM

చిమటా రమేశ్‌బాబు స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘నేను-కీర్తన’. రిషిత, మేఘన హీరోయిన్లు. చిమటా లక్ష్మీకుమారి నిర్మాత. ఇటీవలే చిత్రబృందం ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని...

కీర్తన ప్రేమకథ

చిమటా రమేశ్‌బాబు స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘నేను-కీర్తన’. రిషిత, మేఘన హీరోయిన్లు. చిమటా లక్ష్మీకుమారి నిర్మాత. ఇటీవలే చిత్రబృందం ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘నేను-కీర్తన’ కొత్త తరహా చిత్రం. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో దీనికి స్థానం దక్కుతుందని భావిస్తున్నా. కులు, మనాలీలో చిత్రీకరించిన పాటలు, రోప్‌ ఫైట్స్‌ ఈ చిత్రానికి ప్రత్యేకాకర్షణ’ అని తెలిపారు. ‘నేను-కీర్తన’ చిత్రం ఘన విజయం సాధించాలని దర్శకుడు వీరశంకర్‌, యాటా సత్యనారాయణ ఆకాంక్షించారు. సంధ్య, జీవా, జబర్దస్త్‌ అప్పారావు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ఎం. ఎల్‌ రాజా. సినిమాటోగ్రఫీ: కె. రమణ.

Updated Date - Apr 05 , 2024 | 03:19 AM