దసరాకు వస్తున్న రాజావారు
ABN , Publish Date - Oct 01 , 2024 | 04:05 AM
నార్నే నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ చిత్రం దసరాకు విడుదల కానుంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా...
నార్నే నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ చిత్రం దసరాకు విడుదల కానుంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సంపద హీరోయిన్. ఈ టీజర్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి విడుదల చేసి, టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ‘నార్నే నితిన్ నటిస్తున్న మరో మంచి సినిమా ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’, దసరాకు విడుదల చేస్తున్నాం’ అన్నారు.