కింగ్‌ఖాన్‌కి కోపమొచ్చింది

ABN , Publish Date - Jan 04 , 2024 | 05:58 AM

షారుక్‌ఖాన్‌ ఇరిటేటయ్యారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్న బాలీవుడ్‌ బాద్‌షాకి కోపం తెప్పించింది. దాంతో సదరు అభిమానిని ఆయన సున్నితంగా మందలించారు...

కింగ్‌ఖాన్‌కి కోపమొచ్చింది

షారుక్‌ఖాన్‌ ఇరిటేటయ్యారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్న బాలీవుడ్‌ బాద్‌షాకి కోపం తెప్పించింది. దాంతో సదరు అభిమానిని ఆయన సున్నితంగా మందలించారు. షారుక్‌ రీసెంట్‌ హిట్‌ ‘డంకీ’ ప్రమోషన్‌లో భాగంగా అభిమానులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో వారు అడిగిన ప్రశ్నలకు సరదసరదాగా సమాధానాలిచ్చేశారు షారుక్‌. అయితే.. ఓ అభిమాని అత్యుత్సాహంతో అడిగిన ప్రశ్న షారుక్‌ని ఇరిటేట్‌ చేసింది. ‘సార్‌.. అసలు ‘డంకీ’ బడ్జెట్‌ ఎంత? కొందరు 85 కోట్లు అంటున్నారు. కొందరు 120కోట్లు అంటున్నారు. ఇంకొందరేమో మీ రెమ్యునరేషన్‌ కలుపుకొని 350కోట్లు అంటున్నారు. ఇందులో నిజం ఏది? అసలు నిజం మీ నోటివెంట వినాలనుంది’ అంటూ ఆ అభిమాని ప్రశ్నించగా షారుక్‌ ముఖ కవళికలు మారిపోయాయి. ‘బ్రో.. ఆ విషయాలు నీకవసరమా? బిజినెస్‌ చేసేవాళ్లకు వదిలెయ్యాలి. ఆ గొడవలు వాళ్లు చూసుకుంటారు. ఉపయోగం లేని విషయాల గురించి ఆలోచించి ఎందుకు టైమ్‌ వేస్ట్‌ చేసుకుంటున్నావ్‌?’ అంటూ సున్నితంగా ఆ అభిమానిని మందలించారు షారుక్‌. దాంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణమంతా నిశ్శబ్దంగా మారిందట.

Updated Date - Jan 04 , 2024 | 05:58 AM