ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్
ABN , Publish Date - Oct 16 , 2024 | 06:04 AM
‘డియర్ మేఘ’, ‘భాగ్ సాలే’ వంటి భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ చిత్రాన్ని...
‘డియర్ మేఘ’, ‘భాగ్ సాలే’ వంటి భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి లాంఛ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.