Rajadhani Rowdy: ‘రాజధాని రౌడీ’గా కెజియఫ్ స్టార్ వచ్చేది ఎప్పుడంటే?

ABN , Publish Date - Jun 10 , 2024 | 09:40 PM

సంతోష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత సంతోష్ కుమార్ నిర్మాణంలో, ‘కెజియఫ్’ చిత్రంతో సంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన యశ్ హీరోగా, షీనా హీరోయిన్‌గా, కె.వి రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజధాని రౌడీ’. ఈ చిత్రం జూన్ 14న భారీస్థాయిలో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Rajadhani Rowdy: ‘రాజధాని రౌడీ’గా కెజియఫ్ స్టార్ వచ్చేది ఎప్పుడంటే?
Hero Yash

సంతోష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత సంతోష్ కుమార్ నిర్మాణంలో, ‘కెజియఫ్’ (KGF) చిత్రంతో సంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన యశ్ (Yash) హీరోగా, షీనా హీరోయిన్‌గా, కె.వి రాజు (KV Raju) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజధాని రౌడీ’ (Rajadhani Rowdy). ఈ చిత్రం జూన్ 14న భారీస్థాయిలో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా నిర్మాత సంతోష్ కుమార్ (Santosh Kumar) మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు, మద్యపానం బారినపడి నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘రాజధాని రౌడీ’. వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందిన చిత్రమిది. చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ, ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ (Prakash Raj) పోలీస్ ఆఫీస్‌గా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముమైత్ ఖాన్ (Mumaith Khan) తన అందాలతో కనువిందుచేస్తారు. అర్జున్ జన్య సంగీతాన్ని అందరినీ ఆకర్షిస్తుంది. ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. అత్యధిక థియేటర్లలో ఈనెల 14న విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. (Rajadhani Rowdy Ready to Release)

Updated Date - Jun 10 , 2024 | 09:40 PM