కార్తి కొత్త చిత్రం

ABN , Publish Date - Sep 16 , 2024 | 05:46 AM

కార్తి కథానాయకుడిగా నటించబోయే తదుపరి చిత్రం ఖరారైంది. ‘కార్తి 29’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. ‘తానక్కరన్‌’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ్‌...

కార్తి కథానాయకుడిగా నటించబోయే తదుపరి చిత్రం ఖరారైంది. ‘కార్తి 29’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. ‘తానక్కరన్‌’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ్‌ దర్శకత ్వం వహిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్రబృందం ఆదివారం తెలిపింది. ఎస్‌. ఆర్‌ ప్రకాశ్‌ బాబు, ఎస్‌.ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 05:46 AM