మరోసారి న్యూజిలాండ్‌కు కన్నప్ప

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:03 AM

మంచు విష్ణు నటిస్తున్న డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ న్యూజిలాండ్‌లో మొదలైంది. విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, ప్రభాస్‌ తదితరులు నటిస్తున్నారు...

మరోసారి న్యూజిలాండ్‌కు కన్నప్ప

మంచు విష్ణు నటిస్తున్న డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ న్యూజిలాండ్‌లో మొదలైంది. విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, ప్రభాస్‌ తదితరులు నటిస్తున్నారు. ‘మహాభారతం’ సీరియల్‌ను రూపొందించిన ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ‘కన్నప్ప’ చిత్రం తొలి షెడ్యూల్‌ 90 రోజుల పాటు న్యూజిలాండ్‌లోనే జరిగింది. రెండో షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు కలిగిన ఈ చిత్రాన్ని ఓ దృశ్య కావ్యంగా తెరకెక్కిస్తున్నారు నిర్మాత డాక్టర్‌ మోహన్‌బాబు.

Updated Date - Feb 29 , 2024 | 05:03 AM