వేసవికి వస్తున్న ‘కన్నప్ప’

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:59 AM

డాక్టర్‌ మోహన్‌బాబు భారీ వ్యయంతో నిర్మిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. మంచు విష్ణు టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 25న విడుదల చేయనున్నారు...

డాక్టర్‌ మోహన్‌బాబు భారీ వ్యయంతో నిర్మిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. మంచు విష్ణు టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 25న విడుదల చేయనున్నారు. ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ దేవాలయాన్ని సందర్శించిన ‘కన్నప్ప’ టీమ్‌ అక్కడే విడుదల తేదీ వెల్లడించింది. ఈ సినిమా విడుదల లోపు పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శిస్తామని విష్ణు ఇంతకుముందే వెల్లడించారు. ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘కన్నప్ప’ చిత్రంలోని మేజర్‌ పార్ట్‌ను న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ ఇచ్చే విధంగా తయారవుతున్న ఈ సినిమాలో మహాదేవ శాస్త్రిగా మోహన్‌బాబు ఓ పవర్‌పుల్‌ పాత్ర పోషిస్తున్నారు.

Updated Date - Nov 26 , 2024 | 03:59 AM