కేన్స్‌లో కన్నప్ప సందడి

ABN , Publish Date - May 22 , 2024 | 01:00 AM

విష్ణు మంచు టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావచ్చింది. దాంతో ప్రమోషన్‌ వర్క్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు...

కేన్స్‌లో కన్నప్ప సందడి

విష్ణు మంచు టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావచ్చింది. దాంతో ప్రమోషన్‌ వర్క్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు వెళ్లిన కన్నప్ప టీమ్‌ అక్కడ సందడి చేసింది. నిర్మాత మోహన్‌బాబు, విష్ణు, ప్రభుదేవా ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. అక్కడ ‘కన్నప్ప’ టీజర్‌ను అందరికీ ప్రదర్శించారు. ఈ టీజర్‌ చూసి అక్కడి ప్రేక్షకులు ముగ్ధులయ్యారని విష్ణు తెలిపారు. ఇంటర్నేషనల్‌ డిస్ట్రిబూటర్స్‌, కేన్స్‌ ఫెస్టివల్‌కు వచ్చిన ఇండియన్స్‌ టీజర్‌ బాగుందని అభినందించారు. ఆ రెస్పాన్స్‌ చూసిన తర్వాత నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు.’ అని ఆయన తెలిపారు. జూన్‌ 13న ఇండియా వైడ్‌గా ‘కన్నప్ప’ టీజర్‌ విడుదల చేస్తారు. దానికంటే ముందు ఈ నెల 30న తెలుగులో కన్నప్ప టీజర్‌ను రిలీజ్‌ చేస్తామని విష్ణు వెల్లడించారు.


‘మా కన్నప్పను సోషల్‌ మీడియాలో మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న కొంతమంది సెలెక్టెడ్‌ ఆడియన్స్‌కు ఈ టీజర్‌ చూపిస్తాం’ అని అన్నారు. ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.

Updated Date - May 22 , 2024 | 01:00 AM