టైమ్ ట్రావెల్ నేపథ్యంలో
ABN , Publish Date - Sep 03 , 2024 | 05:56 AM
కన్నడ హీరో కిచ్చా సుదీప్, ‘హనుమాన్’ చిత్ర నిర్మాతలు కె. నిరంజన్‌రె డ్డి, చైతన్యరెడ్డి కాంబినేషన్‌లో ఓ చిత్రం సెట్టయింది.
కన్నడ హీరో కిచ్చా సుదీప్, ‘హనుమాన్’ చిత్ర నిర్మాతలు కె. నిరంజన్‌రె డ్డి, చైతన్యరెడ్డి కాంబినేషన్‌లో ఓ చిత్రం సెట్టయింది. ‘బిల్లా రంగ బాషా’ పేరుతో వస్తున్న ఈ సినిమాకు అనూప్ భండారి దర్శకుడు. సోమవారం సుదీప్ పుట్టిన రోజు సందర్భంగా యూనిట్ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రం ట్రెమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతోంది, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.