‘ఎమర్జెన్సీ’ని బ్యాన్ చేయాల్సిందే!
ABN , Publish Date - Aug 24 , 2024 | 06:49 AM
కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. సెప్టెంబర్ 6న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సిక్కుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ‘ఎమర్జన్సీ’ చిత్రం ఉందనీ, సిక్కులకు
సిక్కుల డిమాండ్
కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. సెప్టెంబర్ 6న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సిక్కుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ‘ఎమర్జన్సీ’ చిత్రం ఉందనీ, సిక్కులకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలనీ, విడుదల చేయడానికి వీల్లేదని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) అకల్ తక్త్ డిమాండ్ చేశాయి. ఎస్‌జీపిఎస్ ఛీఫ్ హర్‌జిందర్ సింగ్ ధామి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి కంగనను తీవ్రంగా విమర్శించడమే కాకుండా ఆమెపై కేసు పెట్టాలని కూడా కోరారు. సిక్కులను వ్యతిరేకించే సన్నివేశాలు ఈ మధ్య సినిమాల్లో ఎక్కువ అయ్యాయనీ, అందుకే సెన్సార్‌బోర్డ్‌లో సిక్కులకు కూడా తగినంత ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ‘ఎమర్జెన్సీ’ చిత్రం తీస్తున్నట్లు 2021లో కంగనా ప్రకటించినప్పటి నుంచీ ఈ సినిమాకు చిక్కులే. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషిస్తూ, దర్శకత్వం వహించారు. ఇది ఇందిరాగాంధీ బయోపిక్ కాదనీ, ఓ పొలిటికల్ డ్రామా అని ఎన్నో సార్లు కంగనా వెల్లడించానా వివాదాలు ఈ సినిమాను వదల్లేదు. ఎన్నో అవరోధాలు తట్టుకుని, విడుదలకు సిద్ధం చేస్తే ఇప్పుడు సిక్కుల నుంచి కంగనాకు ప్రతిఘటన ఎదురైంది.