స్ఫూర్తినిచ్చే కథతో ‘కంచర్ల’

ABN , Publish Date - Jan 22 , 2024 | 01:02 AM

సమాజానికి స్ఫూర్తినిచ్చే కథతో రూపుదిద్దుకుంటున్న ‘కంచర్ల’ చిత్రం టాకీ పార్ట్‌ పూర్తి చేసుకుంది. కంచర్ల ఉపేంద్ర హీరోగా, మీనాక్షి జైస్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రెడ్డెం యాదకుమార్‌ దర్శకుడు....

స్ఫూర్తినిచ్చే కథతో ‘కంచర్ల’

సమాజానికి స్ఫూర్తినిచ్చే కథతో రూపుదిద్దుకుంటున్న ‘కంచర్ల’ చిత్రం టాకీ పార్ట్‌ పూర్తి చేసుకుంది. కంచర్ల ఉపేంద్ర హీరోగా, మీనాక్షి జైస్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రెడ్డెం యాదకుమార్‌ దర్శకుడు. చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు చిత్ర వివరాలు వెల్లడిస్తూ ‘యువత రాజకీయాల్లోకి రావాలని, భూస్వాముల దగ్గరున్న భూమిని పేద ప్రజలకు పంచాలన్నది ఈ చిత్రకథాంశం. దీనికి కమర్షియల్‌ అంశాలు జోడించి ప్రేక్షకులను అలరించేలా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కేరళ, గోవా, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో జరుగుతోంది. మరో పక్క పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’ అన్నారు. ‘ఉపేంద్రగాడి అడ్డా’ చిత్రంతో తను ప్రేక్షకులకు దగ్గరయ్యానని, ఈ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంటాననీ హీరో ఉపేంద్ర చెప్పారు. సామాజిక స్ఫృహతో సమాజాన్ని జాగృతం చేసే అంశాలను ఇందులో పొందుపరుస్తునట్లు దర్శకుడు యాదకుమార్‌ తెలిపారు. సుమన్‌, అజయ్‌ ఘోష్‌, కాశీ విశ్వనాథ్‌, సుధ, రాజా రవీంద్ర, సుమన్‌ శెట్టి, దువ్వాసి మోహన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, ఫొటోగ్రఫీ: గుణశేఖర్‌, మాటలు: ప్రసాదుల మధుబాబు, సహ నిర్మాతలు: కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత.

Updated Date - Jan 22 , 2024 | 01:02 AM