Kamal Hasaan Indian 3 : ఇండియన్‌ 3 కూడా ఉంటుంది

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:30 AM

భారతీయ సినీ రంగంలో విశిష్ట నటుల్లో కమల్‌ హాసన్‌ ఒకరు. లోకనాయకుడిగా, వెర్సటైల్‌ జీనియ్‌సగా అభిమానుల నుంచి కితాబులందుకునే కమల్‌, తన మల్టీ టాలెంట్‌తో సినీ ప్రియుల్ని ఎప్పటికప్పుడు అలరిస్తుంటారు...

Kamal Hasaan Indian 3 : ఇండియన్‌ 3 కూడా ఉంటుంది

భారతీయ సినీ రంగంలో విశిష్ట నటుల్లో కమల్‌ హాసన్‌ ఒకరు. లోకనాయకుడిగా, వెర్సటైల్‌ జీనియ్‌సగా అభిమానుల నుంచి కితాబులందుకునే కమల్‌, తన మల్టీ టాలెంట్‌తో సినీ ప్రియుల్ని ఎప్పటికప్పుడు అలరిస్తుంటారు. తాజాగా శ్రుతీహాసన్‌, డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ నటించిన ‘ఇనిమెల్‌’ సాంగ్‌కు లిరిక్స్‌ అందించారు. ఇటీవలే, ఓ మీడియా ఇంటర్వ్యూలో తను నటిస్తున్న సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నేను ఎన్ని పనులు చేసినా నా ఫస్ట్‌ లవ్‌ సినిమానే. ‘విక్రమ్‌’ రిలీజ్‌ అయ్యి రెండేళ్లు దాటినా, ఇంతవరకూ నా నుంచి మరో సినిమా రాలేదని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కొంచెం ఆలస్యమైనా, నా ప్రాజెక్టులు ఒక్కొక్కటి థియేటర్లలో పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. నేను టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఇండియన్‌-2 (భారతీయుడు-2) షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత వెంటనే ఇండియన్‌-3 పనులు మొదలవుతాయి. ఈ చిత్రంలో నేను పోషించే సేనాపతి (సినిమాలో కమల్‌ పాత్ర)లుక్‌కు మేకప్‌ వేయడానికి నాలుగ్గంటలు, తీయడానికి మరో రెండుగంటలు పట్టేది. పార్ట్‌-2లో మొదటి భాగంలోలాగే రెండు పాత్రల్లో కనిపిస్తాను. మే 9న రిలీజ్‌ అయ్యే ‘కల్కి 2898 ఏ.డీ’లో ఓ అతిథి పాత్రలో నటించాను. అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయులు గర్వించే విధంగా ఉంటుంది. ఎలక్షన్లు ముగిశాక మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న ‘థగ్‌ లైఫ్‌’ షూటింగ్‌లో పాల్గొంటాను. అలాగే ధనుశ్‌ నటిస్తున్న ఇళయరాజా బయోపిక్‌కు స్ర్కీన్‌ప్లే అందిస్తున్నాను. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వం వహించే ఈ సినిమాలో నేను నా నిజ జీవిత పాత్ర పోషించడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.

Updated Date - Mar 26 , 2024 | 12:30 AM