ప్రభాస్‌కు కమల్‌ గిఫ్ట్‌..

ABN , Publish Date - Sep 11 , 2024 | 04:17 AM

కమల్‌ హాసన్‌ ‘కేహెచ్‌’ హౌస్‌ ఆఫ్‌ ఖద్దర్‌ అనే బ్రాండ్‌తో ఖాదీ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే, న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్‌ వీక్‌లో ఈ దుస్తులకు చెందిన సరికొత్త కలెక్షన్‌ ‘సుటూర’ను...

కమల్‌ హాసన్‌ ‘కేహెచ్‌’ హౌస్‌ ఆఫ్‌ ఖద్దర్‌ అనే బ్రాండ్‌తో ఖాదీ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే, న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్‌ వీక్‌లో ఈ దుస్తులకు చెందిన సరికొత్త కలెక్షన్‌ ‘సుటూర’ను ప్రదర్శించారు. ఈ సరికొత్త కలెక్షన్‌ను కమల్‌ హాసన్‌ తన ‘కల్కి 2898 ఏ.డీ’ కో స్టార్‌ ప్రభా్‌సకు కానుకగా పంపారు. ఈ కానుకను అందుకున్న ప్రభాస్‌.. తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘‘ప్రేమతో ఈ గిఫ్ట్‌ పంపించినందుకు కృతజ్ఞతలు కమల్‌ సర్‌. మీ కొత్త కలెక్షన్‌కు ఆల్‌ ద బెస్ట్‌’’ అని పేర్కొన్నారు. కాగా, ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏ.డీ’ సినిమాలో.. భైరవ పాత్రలో ప్రభాస్‌.. ‘సుప్రీమ్‌ యాస్కిన్‌’ పాత్రలో కమల్‌ హాసన్‌ అదరగొట్టిన సంగతి తెలిసిందే.

Updated Date - Sep 11 , 2024 | 06:28 AM