కమల్‌ హాసన్‌ మెచ్చుకున్నారు

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:50 AM

మలయాళ మూవీ ఇండస్ట్రీలో లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’. మలయాళ బాక్సాఫీస్‌ వద్ద రూ.200 కోట్లు కలెక్ట్‌ చేసిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. తమిళనాడులోని గుణ కేవ్స్‌లో జరిగిన ఓ వాస్తవ సంఘటన స్ఫూర్తితో...

కమల్‌ హాసన్‌ మెచ్చుకున్నారు

మలయాళ మూవీ ఇండస్ట్రీలో లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’. మలయాళ బాక్సాఫీస్‌ వద్ద రూ.200 కోట్లు కలెక్ట్‌ చేసిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. తమిళనాడులోని గుణ కేవ్స్‌లో జరిగిన ఓ వాస్తవ సంఘటన స్ఫూర్తితో చిదంబరం ఎస్‌ పొదువల్‌ దీనిని తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఏప్రిల్‌ 6న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ చిదంబరం మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కంటెంట్‌ మీద ముందు నుంచి అందరికీ నమ్మకం ఉంది. కానీ రూ.200 కోట్లు కలెక్ట్‌ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. నా సెకండ్‌ సినిమా కథ కోసం అన్వేషిస్తుండగా గుణ కేవ్స్‌లో జరిగిన ఈ సంఘటన గురించి తెలిసింది. నన్ను ఈ కథ ఎంతగానో ఎక్సైట్‌ చేసింది. వెంటనే వర్క్‌ స్టార్ట్‌ చేసి, రియల్‌ లైఫ్‌ మంజుమ్మెల్‌ బాయ్స్‌ను కలిశా. వారు జరిగిందంతా చెప్పారు. విన్నాక ఇది ప్రజలకు తెలియాల్సిన కథ. సినిమా తీయాలి అని మరింత ధృడంగా నిశ్చయించుకున్నాను. సినిమా చూసిన కమల్‌ హాసన్‌ మెచ్చుకోవడం పెద్ద అవార్డు గెలుచుకున్నట్లనిపించింది. మలయాళీలకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. తెలుగులో ఎంతో మంది మంచి నటులు ఉన్నారు. వారితో సినిమా చేసే అవకాశం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పారు.

Updated Date - Apr 02 , 2024 | 05:50 AM